MODEL PAPER - lV ( T/M )


GENERAL SCIENCE - II ( BIOLOGICAL SCIENCE )
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------
CLASS : X PART : A & B MAX . MARKS : 40 TIME : 1.35 Hrs
‐------------------------‐---------------------------------------------------------------------------------------------------------------------
PART - A ( 30 MARKS )
SECTION - I ( 3 × 2 = 6 MARKS )
------------------------‐---------------------------------------------------------------------------------------------------------------------

1. కిరణ జన్య సంయోగక్రియ జరగడానికి కావాల్సిన ముడి పదార్థాలు ఏవి ?
2. నాడీ వ్యవస్థలో ఎన్ని విభాగాలున్నాయి ?
3. ఇన్సులిన్ ఉత్పత్తి తగినంత స్రవించబడకపోతే ఏం జరుగుతుంది ?
4. డార్విన్ ప్రతిపాదించిన పరిణామ సిద్ధాంతాన్ని నిరూపించే రెండు నిదర్శనాలు తెలుపండి.
5. ఏయే పదార్థాలను శరీరం తొలగించవలసిన అవసరం ఉన్నదో తెలపండి.
6. అవాయు శ్వాసక్రియ అనగా నేమి ?

------------------------‐---------------------------------------------------------------------------------------------------------------------
SECTION - II ( 2 x 4 = 8 )
------------------------‐---------------------------------------------------------------------------------------------------------------------

7. వ్యాయామం చేసినప్పుడు కండరాలలో నొప్పి కలుగుతుంది. కండరాల నొప్పికి,
శ్వాసక్రియకు సంబంధం ఏమిటి?
8. హరిత రేణువు పటం గీచి , భాగాలను గుర్తించుము.
9. నిర్మాణ రీత్యా నాడీ కణం, సాధారణ కణం కంటే ఏవిధంగా భిన్నమైనది ? వివరించండి.
10. మెండల్ బఠాని మొక్కను ఏయే లక్షణాలు కోసము ఎన్నుకున్నారు ?

------------------------‐---------------------------------------------------------------------------------------------------------------------
SECTION - III ( 2 X 8 =16 )
------------------------‐---------------------------------------------------------------------------------------------------------------------

11. కృత్రిమ శాఖీయ వ్యాప్తి విధానాలను క్లుప్తంగా వివరించండి.
12. సమవిభజన , క్షయకరణ విభజన మధ్య భేదాలు తెలపండి.
13. మెండల్ ఏక సంకరణాన్ని ఏదేని ఒక లక్షణం ఆధారంగా వివరించండి ?
14. కిరణజన్య సంయోగక్రియకు కాంతి అవసరమని ఎలా నిరూపిస్తావు ?

------------------------‐---------------------------------------------------------------------------------------------------------------------
PART - B ( 10 × 1 = 10 MARKS )
------------------------‐---------------------------------------------------------------------------------------------------------------------

సరియైన సమాధానాన్ని బ్రాకెట్లలో సూచించండి.

1. పత్రహరితంలో ఇమిడి ఉండే లోహం ఏది ? ( )
ఎ. కాల్షియం బి. జింక్
సి. ఐరన్ డి. మెగ్నిషియం

2 . జీర్ణాశయంలో విడుదలయ్యే అమ్లం. ( )
ఎ. HCl బి. H2SO4
సి. NaOH డి. HNO3

3 . ద్విధా విచ్ఛిత్తి ఈ జీవిలో కనబడుతుంది. ( )
ఎ. హైడ్రా బి. యూగ్లీనా
సి. క్లామిడో మోనాస్ డి. మ్యూకార్

4 . DNA అనునది. ( )
ఎ. కణజాలం బి. ఘన పదార్థం
సి. జన్యుపదార్థం డి, ఏది కాదు

5 .లాంగర్ హాన్స్ పుటికలు వీటిలో ఉంటాయి. ( )
ఎ. క్లోమం బి. కాలేయం
సి. ఊపిరితిత్తులు డి. మూత్ర పిండాలు

6 . ఆర్జిత గుణాల అనువంశికత సూత్రాన్ని ప్రవేశపెట్టినది. ( )
ఎ. మెండల్ బి. డార్విన్
సి. లామార్క్ డి. మోర్గాన్

7 . తల్లి యొక్క గర్బయ కుడ్యానికి , బ్రూణమును కలిపి నిర్మాణం. ( )
ఎ. జరాయువు బి. నాభిరజ్జువు
సి. ఎపిడిడైమిస్ డి. ఫాలోపియఫ్ నాళం

8 . అప్పుడే జన్మించిన పిల్లల్లో శ్వాసక్రియ రేటు నిమిషానికి... సార్లు ( )
ఎ. 26 బి. 32
సి. 15 డి. 18

9. అనిషేక ఫలాలను ప్రోత్సహించే హార్మోన్ ( )
ఎ. ఆక్సీన్ బి. సైటోకైనిన్
సి. అబ్ సైసికామ్లం డి. జిబ్బరెల్లిన్

10 . ఉభయ జీవుల్లో మహాసిరలు కలిసి ఏర్పాటు చేసేది. ( )
ఎ. కుడి కర్ణిక బి. మహాధమని
సి. సిరాసరణి డి. ఎడమ కర్ణిక
------------------------‐---------------------------------------------------------------------------------------------------------------------