// త్యాగ శీలి "హోళీక"//     
                       
          హొళీ అంటే రంగుల పండుగ  అని మాత్రమే తెలుసు .పురాణాల ప్రకారం హోళీ పండుగకు ఒక ప్రాశస్త్యం ఉంది .హిరణ్యకశ్యపుని సోదరి హోలిక దగ్ధమైన వృతాంతానికి ప్రతీకగా హొలీ వ్యాప్తిలోకి వచ్చిందని తెలుస్తోంది .దైవ భక్తి కలిగిన వారికి కష్టాలనుంచి కాపాడి ఎల్లవేళలా దేవుడు రక్షణగా ఉంటాడని సందేశమిచ్చే హోలిక కథనమే హొలీ జరపడానికి కారణమని హేమాద్రికాండ , భవిష్యత్ పురాణం , ధర్మసింధు , నిర్ణయసింధు రుజువు చూస్తున్నాయి.హోలిక రాక్షస వర్గానికి చెందినదిగా గుర్తించినప్పటికీ , వాస్తవానికి ఆదిమ జాతి సంతతి లో పుట్టి , తనకంటూ ఒక విశిష్టతను
కలిగి వుంది .

        # రావణాసురుడు ఎంత గొప్ప శివభక్తుడో హోలిక కుడా బ్రహ్మదేవుని మెప్పించి మాయా వస్త్రాన్ని పొందిన ఘనత ఈమెది .హోలిక హిరణ్యకశిపుని సోదరి .కుమారుడైన ప్రహ్లాదుడు విష్ణు భక్తి పరాయణుడు కావడంతో ఆగ్రహించి , అతడిని ఎలాగైనా సరే వధించాలని అనేక ప్రయత్నాలు చేస్తాడు హిరణ్యకశిపుడు .నారాయణ మంత్రం జపిస్తున్న ప్రహ్లాదుడు విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల క్షేమంగా ఉంటాడు .చివరకు హిరణ్యకశిపుడు ఒక ఉపాయం ఆలోచిస్తాడు .బ్రహ్మదేవుడి వరం  వల్ల హోలికకు మయా వస్త్రం లభిస్తుంది .ఎంతటి భయంకరమైన అగ్ని అయిన ఆ వస్త్రాన్ని ధరిస్తే ఆహుతి కాలేరు .హోలికను ఆ వస్త్రాన్ని ధరించమని చెప్పి ,ప్రహ్లాదుడిని ఆమె ఒడిలో కూర్చో బెట్టి ,ఠాణా భటులా చేత నిప్పు అంటింప జేస్తాడు  హిరణ్యకశిపుడు . విష్ణు మాయ చేత హోలిక కప్పుకున్న ఆ వస్త్రం గాలికి ఎగిరిపోయి ఆమె దగ్ధమవుతుంది .ప్రహ్లాదుడు మాత్రం క్షేమంగా బయట పడతాడు .ఈవిధంగా హోలిక దగ్ధమైన వృతాంతానికి ప్రతీకగా హొలీ పండుగ వ్యాప్తిలోకి వచ్చిందని చెబుతారు .

       # రామాయణంలో ప్రతివ్రత సీత లాగ హోళిక నిస్వార్థమైన త్యాగధనురాలు .అరణ్యవాసం తర్వాత రాముడు సీతపై నీలాపనిందలు వేసి అగ్ని పరీక్ష పెడితే కూడా భర్త మాట జవదాటలేదు అలాగే హోళిక  ప్రమాదం పొంచి ఉన్నదని తెలిసి కూడా తన సోదరుడు హిరణ్యకశిపుని ఆజ్ఞ ను కాదనకుండా తన మేనల్లుడైన ప్రహ్లాదునితో కలిసి అగ్ని ప్రవేశానికి పూనుకున్నది. ఆత్మబలిదానానికైనా వెనకాడలేదు హోళిక .అంటే ఆదిమ జాతి వారి ఔదార్యం, ఆత్మ త్యాగాలు పురాణాలను బట్టి పూర్వకాలం నుంచి ఉన్నవే!                     @గుమ్మడి లక్ష్మి నారాయణ;
                            సెల్:  9491318409.