#శుభ్రమైన చేతులతోనే వైరస్ కట్టడి# ***********




 మనం చేతులని శుభ్రంగా కడుక్కోవడం అనేది దినచర్యలో అతి ముఖ్యమైనదిగా భావించాలి. ఎందుకంటే చేతులు చూడ్డానికి శుభ్రంగానే కనిపించవచ్చు .కాని వాటిమీద కోటానుకోట్ల సూక్ష్మజీవు లుంటాయని ఊహించగలరా! నీళ్లతో చేతులు కడుక్కున్నా అవి  అంత సులభంగా పోవు. సబ్బుతోగాని లిక్విడ్ హ్యాండ్వాష్ తో దాదాపూ  20  సెకండ్లు కడుక్కుంటేనే మీ చేతులు శుభ్రంగా ఉన్నట్టు!. ప్రతిరోజూ భోజనం చేయడానికి ముందు మలవిసర్జనకు వెళ్లి వచ్చిన తర్వాత మరియు ఏవైనా తినుబండారాలు తీసుకునే ముందు ఇలా చేతులు శుభ్రపరుచుకోవడం మనల్ని ఎన్నో అనారోగ్యాల నుంచి రక్షిస్తుంది.ఈ ప్రాధాన్యత క్రమంలోనే "యునిసెఫ్" చేతులను శుభ్రపరచుకోవడానికి అవగాహన కొరకు ప్రతి ఏడాది అక్టోబర్ 15 ను" గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే" ( అంతర్జాతీయ చేతుల శుభ్రత దినోత్సవం )గా గుర్తించింది,             ********చేతులు కడుక్కోకుండా ఉండటం వల్ల రెండు వందలకు పైగా రోగాలు మనల్ని దాడి చేసే అవకాశం ఉంది. ఆ రోగాల్ని కలిగించే సూక్ష్మజీవులు ఉండేది చేతుల్లోనే అంటే ఆశ్చర్యం అనిపించక పోదు. ఏటా ప్రపంచ వ్యాప్తంగా 35 లక్షల మంది చిన్నారులు డయేరియా , నిమోనియా లాంటి రోగాల వల్ల మరణిస్తున్నారు. వీటిని నివారించడానికి చేపట్టే అవగాహన కార్యక్రమమే' గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే'. ఓ అంతర్జాతీయ సర్వే ప్రకారం మన దేశంలో కేవలం 44 శాతం మంది మాత్రమే చేతుల శుభ్రత పాటిస్తున్నారని తేలింది . ప్రపంచ బ్యాంకు, యూనిసెఫ్ ఆధ్వర్యంలో "గ్లోబల్ పబ్లిక్ - ప్రైవేట్ పార్టనర్షిప్ హ్యాండ్ వాషింగ్' సంస్థ తొలిసారిగా హ్యాండ్ వాషింగ్ డే కార్యక్రమాన్ని 2008లో ప్రారంభించింది. మన దేశం తరఫున క్రికెటర్లు సచిన్ టెండూల్కర్ ,యువరాజ్ సింగ్ లు వేలాది మంది పిల్లల మధ్య సబ్బుతో చేతులు కడుక్కొని ప్రచారం చేశారు.                              ******కరోనా వైరస్ (కొవిడ్-19 )వేగంగా వ్యాపిస్తోన్న నేపథ్యంలో చేతి నుంచి సులువుగా నోరు, కళ్ళు, ముక్కు ద్వారా శరీరంలోకి చేరుతుంది అని ఒక పరిశోధన ద్వారా తెలుస్తోంది. అందుకే ప్రతి 20 నిమిషాలకు ఓసారి చేతులు కడుక్కోమని వైద్యులు చెబుతున్నారు. అయితే చేతులు కడుక్కోవటం తో పాటు ముఖంలోని కళ్ళు, ముక్కు లాంటివి శరీర భాగాలను తరచు తాకకుండా చూసుకోవడమే వైరస్ ను అడ్డుకోవడానికి ఉత్తమ మార్గం .గతంలో ఆస్ట్రేలియాలో 26 మంది వైద్య విద్యార్థుల మీద జరిపిన పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. గంట  వ్యవధిలో సుమారు 23 సార్లు మనం చేతులతో ముఖం లోని పలు భాగాలను తాకుతామని అందులో వెల్లడైంది. ఒక గంట వ్యవధిలో గడ్డం ,చెక్కిళ్లు ,పెదవులు నాలుగు సార్లు ;ముక్కు ,నుదురును   మూడు సార్లు; చెవులను ఒకసారి చొప్పున తాకారు. కరోనా సులువుగా శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నా నోరు ,కళ్ళు, ముక్కు భాగాలను ఎక్కువసార్లు తాకినట్లు వెల్లడైంది.                              ***హ్యాండ్ వాషింగ్ టెక్నిక్ - ప్రాధాన్యత*** హ్యాండ్ వాషింగ్ అనేది ముఖ్యమైన హైజీన్ టెక్నిక్. చేతుల శుభ్రత సమయంలో 'సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్' (సీడీసీ)   వారు సూచించిన ప్రకారం  ఆరు సూత్రాలు  పాటించి తీరాలి.                                               1.చేతులను శుభ్రమైన రన్నింగ్ వాటర్ తో కడుక్కోవాలి.                                                2 .తగినంత సబ్బును అంటించుకుని చేతులను బాగా రుద్దు కోవాలి.                                            3 .చేతుల వెనక వైపు ,వేళ్ళ మధ్యలో ,గోర్ల మధ్యలో ప్రాధాన్యతనివ్వాలి.                             4. 20 సెకండ్ల పాటు చేతులను స్క్రబ్ చేసుకోవాలి.                                                     5. రెండు చేతులను రన్నింగ్ వాటర్ కింద బాగా రిన్స్ చేయాలి.                                                   6. శుభ్రమైన టవల్ లేదా పొడి గుడ్డతో చేతులను డ్రై చేసుకోవాలి.                                             ********* సరైన హ్యాండ్  వాషింగ్ టెక్నిక్ ద్వారా చేతులను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల క్రిములు వ్యాప్తి చెందవు .తద్వారా అనారోగ్యం దరిచేరదు.సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోకపోతే అనేక ఇతర వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది .చర్మ సమస్యలు కూడా ఎదురవుతాయి .తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం అనేది ప్రత్యేక కార్యకలాపాల ముందు తర్వాత తూ. చ .తప్పక పాటిస్తే బ్యాక్టీరియా ,వైరస్ల  విస్తరణను సమర్థవంతంగా అరికట్టవచ్చు.                                  ******"చేతుల మాలిన్యం వల్ల వచ్చే వ్యాధులు"  ..................

........చేతులు కడుక్కోకుండా దైనందిన కార్యకలాపాలు నిర్వహించడం వల్ల నాలుగు రకాల వ్యాధులు సంభవించే అవకాశం ఉంది.     1 .వైరల్ గ్యాస్ట్రో  ఎంటరైటిస్:- చేతులను శుభ్రంగా కడుక్కోవడం వల్ల వైరస్ ద్వారా ఈ వ్యాధి  వ్యాపిస్తుంది. చేతుల మాలిన్యం వల్ల డయేరియా కలుగుతుంది .ఈ వ్యాధి వలన పొత్తికడుపులో నొప్పి ,తలనొప్పి ,కండరాల నొప్పి, కీళ్ల నొప్పులు ఎదురవుతాయి.                            2 .ఎయిర్ బర్న్ఇల్నెస్: సాధారణ జలుబు ,ఇన్ఫ్లుఎంజా, మెనింజైటిస్ వంటి సమస్యలను ఎయిర్ బర్న్ఇల్నెస్ అంటారు. వీటి వల్ల తలనొప్పి ,గ్రంథుల వాపు వంటి లక్షణాలు ఏర్పడతాయి .                                                   3 .నోసికోమియల్ ఇన్ఫెక్షన్స్:- ఈ  ఇన్ఫెక్షన్స్ ఒక రకమైన సాఫ్ట్ బ్యాక్టీరియా ద్వారా వ్యాపిస్తాయి. ఇవి ఎక్కువగా ఆసుపత్రులలో వ్యాప్తి అవుతాయి. ఆసుపత్రిలో సిబ్బంది, రోగులు చేతుల శుభ్రతలో  అజాగ్రత్త వల్ల కొన్ని ఇన్ఫెక్షన్స్ ఏర్పడతాయి. జ్వరం ,గాయం నుండి స్పెల్లింగ్ ,యూరినేటింగ్ సమయంలో మంట వంటివి ఈ ఇన్ఫెక్షన్ లక్షణాలు.                                                          4 . హెపటైటిస్- ఏ :-కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలు సరిగా కడుగకపోవడం వల్ల ఆహారం కలుషితం జరిగి ఈ ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంది.                                        *********హోటల్ రెస్టారెంట్ లలో ఫుడ్ వర్కర్స్ వద్ద నుంచి క్రిముల వ్యాప్తి అనేది పుడ్ బర్న్ ఇల్నెస్ కు ప్రధాన కారణంగా తేలింది. ఇది 89 శాతం  వర్కర్స్ చేతులు కడుక్కోకుండా ఆహారం తయారీ ,సరఫరా చేయడమే. యూఎస్ ఫుడ్ మరియు డ్రగ్ అడ్మినిస్ట్రేషన్  (ఎఫ్ డి ఎ ) సూచనల ప్రకారం ఆహారం తయారు చేసే ముందు చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలి. అలాంటి  సమయాల్లో వర్కర్లు  తప్పకుండా మాస్కులు,గ్లౌజులు,అఫ్రానులు విధిగా ధరించాలి. అలాగే వంటల తయారీ ,సరఫరా సమయంలో వంట పాత్రలు శుభ్రం చేసిన తర్వాత ఎప్పటికప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవడం తప్పనిసరి .రెస్టారెంట్ యాజమాన్యం హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ ను వర్కర్స్ చేత పాటించేలా జాగ్రత్త తీసుకోవాలి. కరోనా వంటి వైరస్ లను నిర్మూలించడంలో చేతుల శుభ్రతను కూడా అతి ముఖ్యమైనదిగా భావిస్తే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది.                            #గుమ్మడి లక్ష్మీనారాయణ,సెల్:7989134271  #



Show quoted text
Show quoted text